Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-పెద్దవూర
పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ది చెందుతాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు.సోమవారం మండలంలోని పోతునూరు,పినవూర, పెద్దవూర,బట్టుగూడెం, చింతపల్లి, పెద్దగూడెం, లింగంపల్లి గ్రామాల్లో పల్లె ప్రకతి వనాలను పరిశీలించారు.పోతునూరు స్టేజి నుంచి పెద్దవూర వరకు ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలకు ఏర్పాటు చేసిన అవెన్యూప్లాంటేషన్ను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే వెంట రోడ్డుకు ఇరువైపులా, గ్రామంలోకి దారి పొడవునా, పచ్చని చెట్లను చూసి మండలం లోని గ్రామాలు ఆహ్లాదకరంగా ఉన్నాయన్నారు.తడి,పొడి చెత్తను వేరు చేసి వర్మీకంపోస్టు ఎరువుల తయారీ బాధ్యతను ఉత్సాహంగా పని చేసే మహి ళా గ్రూపు సభ్యులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.జడ్చర్ల-దేవరకొండ హైవేరోడ్డుకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో పల్లెప్రకతివనాలు పార్కులను తలపిస్తున్నాయన్నారు.పల్లెల అభివద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దుబ్బ శ్యామ్, ఎంపీఓ విజయకుమారి,తహసీల్దార్ సైదులు, ఎంపీటీసీ తరి లక్ష్మీ, ఏపీఓ వెంకటేశ్వర్లు,సర్పంచులు నడ్డి లింగయ్య, తుమ్మ దుర్గమ్మ, కార్యదర్శి డాకునాయక్ పాల్గొన్నారు.
నాటిన మొక్కలపై నిఘా పెట్టాలి
కొండమల్లేపల్లి :హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలపై ప్రజాప్రతినిధులు,అధికారులు నిఘా పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ సూచించారు. సోమవారం మండలంలోని కొండమల్లేపల్లి,గుమ్మడవెల్లి ,చిన్నచర్లపల్లి గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు.సర్పంచులు, అధికారులతో మాట్లాడారు.రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు రక్షణకంచె ఏర్పాటు చేసి మొక్కలకు పాదులు చేయాలని చుట్టుపక్కల ఉన్న గడ్డిజాతి పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు.ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరుపోయాలని సూచించారు.జనరల్‌ఫండ్ నిధుల నుంచి 10 శాతం గ్రీన్నెట్కు ఖర్చు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీపీఓ విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్, గుండెబోయిన లింగంయాదవ్, గడ్డం శ్రీరాములు,ఏపీఓ రామచంద్రం, ఈఓ వీరబాబు, నగేష్ పాల్గొన్నారు.