Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నట్టు ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి చంద్రకళ తెలిపారు. సోమవారం పట్టణకేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాజెక్ట్ పరిధి 5మండలాలలో రాజాపేట, ఆలేరు ,యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి ,మోటకొండూరు' పరిధిలో 3 అంగన్వాడీ టీచర్లు, 1 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఆలేరు సిల్క్ నగర్ మినీ అంగన్వాడీ సెంటర్ ,యాదగిరిగుట్ట జంగంపల్లి ,ఆలేరు మండలం గొలనుకొండ 2 , తుర్కపల్లి వేల్పుల పల్లి ,జీకే తాండా 1 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు .ఆయా పోస్టులు ఆలేరు మండలం కొల్లూరు, తుర్కపల్లి, బిలియతండా, ముల్కలపల్లి, గంగారాం తండా, బదుతండా, పెద్దతండా,చిన్న లక్ష్మాపూర్ 1,యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెం 1, చిన్నకందుకూరు 2, మైలార్గూడెంలో, యాదగిరిగుట్ట, వైజీటీఎస్ కాలనీ, మోటకొండూరు చాడ 2, అమ్మనబోలు1 రాజపేట మండలం బేగంపేట3, ఆలేరు సిల్క్ నగర్లలో ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. 18 నుంచి 21 ఏండ్ల వయస్సు కలిగి అర్హులైన ి 25 తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 8309582086, 9948203465, 7780335145 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు .
మోత్కూరు : ఐసీడీఎస్ మోత్కూరు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్ వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జ్యోత్స్న తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా కాలనీ (12వ వార్డు) ఆయా(ఎస్సీ), మండలంలోని పాటిమట్ల కేంద్రంలో ఆయా (జనరల్), గుండాల మండలం తుర్కలశాపురం కేంద్రం-1లో ఆయా(జనరల్), వంగాల కేంద్రంలో ఆయా(ఎస్సీ), బూర్జుబావిలో టీచర్ (జనరల్), సీతారాంపురం కేంద్రం-3లో టీచర్ (దష్టి లోపం ఉన్న వికలాంగులు), అడ్డగూడూరుమండలం వెళ్తేవిలో టీచర్ (బీసీ-సీ), ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురంలో టీచర్ (ఎస్సీ), పల్లెర్ల కేంద్రం-3లో టీచర్ (ఎస్సీ), తుక్కాపురంలో ఆయా (జనరల్) పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ కేంద్రాల పరిధిలో వివాహితురాలైన స్థానికంగా ఉండి 21 నుంచి 35 సంవత్సరాల వయస్సు, ఎస్సీ రిజర్వ్ కేంద్రాల పరిధిలో 18 నుంచి 21 ఏండ్ల వయస్సు కలిగి అర్హులైన వారు ఈ నెల 25 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.