Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలంలోని కుతుబుషాపురం గ్రామంలో సర్పంచ్ నల్లపాటి వీరమ్మ భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం కరోనా టీకా క్యాంపు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ దగ్గరుండి ప్రజలకు టీకా వేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రమీల, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఆశా వర్కర్లు సైదాబీ, సైదమ్మ, శ్రీలత, దుర్గ, లింగమ్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.