Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ సాధన కోసం,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడిని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ అధ్యక్షులు బుడిగ వెంకటేశ్ కోరారు.మంగళవారం స్థానికంగా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీను, నాగేంద్రప్రసాద్. నాగనాయక్, సమద్, రవి, పవన్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ :రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ సాధన కోసం,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న నిర్వహించనున్న డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రవినాయక్ కోరారు.మంగళవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నీటి మూటలుగానే మిగిలాయన్నారు.స్వరాష్ట్ర సాధన ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయ సాధన కోసం జరిగిందో..అది నెరవేరలేదన్నారు. ఉద్యోగాల జాతర ప్రభుత్వం ఊకపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని విమర్శించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను, మండలాధ్యక్షుడు గూడ నాగేంద్రప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదానాయక్, జగన్, నాయకులు సమద్, రవి, పవన్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి: విద్యారంగ సమస్యలను నిరుద్యోగులు నోటిఫికేషన్ను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే అటువంటి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్ కోరారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.