Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
నవ తెలంగాణ -నార్కట్ పల్లి
పచ్చి పాలతో సమస్త మానవాళికి ముప్పు ఉన్నదని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి మల్లాది వెంకట సుబ్బారావు అన్నారు.మంగళ వారం మండల పరిధిలోని అక్కినపల్లి గ్రామంలో విరాట్ డెయిరీ ఫాం లో నాలుగు నుంచి ఎనిమిది నెలల ఆడ దూడలకు బ్రూసెళ్ళ లేస్సేస్ వ్యాధి నివారణా వ్యాక్సిన్ వేశారు. దూడలకు చెవి పోగులు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రూసెళ్ళ లేస్సేస్ వ్యాధి ఉన్న జంతువుల పచ్చి పాలనుగాని పాలతో తయారుచేసిన పదార్థాలను కాని ఆహార పదార్థాలు స్వీకరించినప్పుడు అనారోగ్య బారిన పడతామని చెప్పారు .ఈ వ్యాక్సిన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అన్ని గ్రామాల్లో భారత ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఈ వ్యాధి ద్వారా పశువులకు గ్రార్భాస్రావం జరుగుతుందని ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని చెప్పారు. మనుషులకు ఒంటినొప్పులు, పురుషులకు, వ్యధ్య తవం ఏర్పడుతుందని మహిళలకు గర్భస్రావం జరుగుతుందని లైంగిక సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సహాయ సంచాలకులు డాక్టర్ రాచకొండ రెడ్డి డాక్టర్ యమని సురేష్ , డాక్టర్ అంగోతు రవి కుమార్ డాక్టర్ కట్ట జ్యోత్స్న, సర్పంచులు మాదాసు చంద్రశేఖర్ , శ్రీనివాస్ రెడ్డి, కే దుర్గ భవాని, డి సుజాత, గోపాలమిత్ర అశోక్ రియాజ్, పాల్గొన్నారు.