Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఈనెల 20,21 తేదీలలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో కేంద్ర పర్యాటక సాంస్కతిక , ఈశాన్య రాష్ట్రాల అభివద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు కోరారు. మంగళవారం పట్టణకేంద్రంలోని రహదారి బంగ్లా వద్ద జిల్లా ఇన్చార్జి నందకుమార్యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కార్యదర్శి చిరిగి శ్రీనివాస్, పంపరి లక్ష్మీనారాయణ ,ఐడియా శ్రీనివాస్ ,జంపాల శ్రీనివాసు,మండల , పట్టణ అధ్యక్షులు దుసరి రాఘవేంద్ర, బడుగు జహంగీర్, ప్రధాన కార్యదర్శులు పులిపలుపుల మహేష్ ,బందెల సుభాష్ , ఓబీసీ జిల్లా కార్యదర్శి తునికి దశరద , ఉపాధ్యక్షులు కటకం రాజు ,జెట్టా సిద్దులు, పగడాల శ్రీనివాస్,పత్తి రాములు , ఎలాగందుల రమేష్ , నంద గంగేష్, పత్తి రాజు , పస్తం ఆంజనేయులు , ఐలి సందీప్ పాల్గొన్నారు