Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవస్థ కూడా మసకబారుతుందిబీసీలకు తక్షణం సబ్ ప్లాన్ అమలు చేయాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుందని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా మసకబారుతుందన్నారు. లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు ఒకటైతేనేదేశాన్ని కాపాడుకోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన ఇక్కడ టాక్సీల పేరుతో జనాలపై బారం మోపుతున్నారని విమర్శించారు. దళిత బంధు అమలు రాష్టంలో అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు.17 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయని వాటికి లక్ష 70 వేల కోట్లు కావాలని, మొత్తం రాష్ట్ర బడ్జెట్ లక్షా 40 వేల కోట్లని వివరించారు. ఇలా అయితే దళితబందు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతుంటే ఉన్నోడు మరింత డబ్బు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా 51 శాతం ఉంటుందని వారికి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు అందజేయాలన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ,బీసీ లఅభివద్ధి కోసం సమగ్ర విధానం ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లన్నిఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు, బీసీల అభివద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు బీసీల పోరాటానికి సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు రాష్ట్ర నాయకులు ఎన్ బాల మల్లేష్,బీసీ సబ్ ప్లాన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏం సారంగపాణి,రాయ బండి పాండు రంగాచారి ,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్లెంకష్ణ,ఏశాల అశోక్ , జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ ,ఏఐవైఏఫ్ జిల్లా కన్వీనర్ పెరబోయిన మహెందర్ , మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్,మున్సిపల్ కౌన్సిలర్ దండ బోయిన అనిల్ ,కోఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య పట్టణ నాయకులు గోపగాని రాజు పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.