Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -చిట్యాల
కమ్యూనిస్టులు చేసే పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మండలంలోని వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రజా సేవలో కమ్యూనిస్టుల పాత్రను అధిగమించే రాజకీయ పార్టీలు తక్కువ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేస్తూనే సేవా కార్యక్రమాలు చేసేది కమ్యూనిస్టులేనని తెలిపారు. చట్ట సభల్లో కమ్యూనిస్టుల బలం తగినంత లేని కారణంగా పాలక పార్టీలు ప్రజలపై ధరల భారాన్ని వేస్తున్నాయన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సాగు నీటి కాల్వల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను రోడ్డుపైన పడేసే ప్రయత్నం చేస్తోందన్నారు. దానికి తోడుగా విద్యుత్ చట్టాలను తీసుకొచ్చి మోటార్లకు మీటర్లను పెట్టి రైతులపై కరెంటు బిల్లులు వసూలు చేయాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జెండాను ఆ పార్టీ సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి ఆవిష్కరించారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు శీలా రాజయ్య, అరూరి శ్రీను ,అరూరి శంభయ్య , ఐతరాజు నర్సింహ ,రుద్రారపు పెద్దులు ,నాతి వెంకట్రామయ్య, మల్లం మహేష్ ,మహిళా నాయకులు బొంతల లక్ష్మి, ఆరూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.