Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ఐదు రోజులుగా లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఉస్తెల సజన డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని ధర్మభిక్షం భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవారిపై,పసిపిల్లలపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు.గాంధీ హాస్పిటల్లో ఐదు రోజులుగా ఇద్దరు మహిళలపై లైంగికదాడి జరుగుతుంటే హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్లు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన మహిళా సంఘాలు విషయం తెలుసుకుందామని వెళితే వారిని అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకులు దంతాలపద్మ రేఖ, దంతాల ధనలక్ష్మీ పాల్గొన్నారు.