Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ఓయూ జేఏసీ నాయకుడు పాల్వాయి నగేష్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యూత్ క్లబ్ అధ్యక్షులు బొంకురి జలంధర్, తుంగతుర్తి ఎంపీటీసీ చెరుకు సజన అన్నారు.మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు.బహుజనులు అధిక జనాభా కలిగిన నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అతని అనుచరులు నగేష్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చెరుకు పరమేష్, తడకమళ్ళ మల్లికార్జున్ ,బొంకూరు మల్లేష్ పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివద్ధి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తే అనేక నిధులు వస్తాయని ప్రశ్నించిన పాల్వాయి నగేష్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఎంఎస్ఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి తడకమళ్ళ రవి కుమార్ అన్నారు.మండలకేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని ప్రశ్నించిన నాయకులపై గతంలోనూ దాడులు చేసిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. కేసులతో దాడులతో ప్రశ్నించే గొంతుకలను అణిచి వేసేందుకు ప్రయత్నిస్తే మరింత ప్రశ్నించేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్షనాయకులు ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు కొండ నాగరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు రాంబాబు, బీజేవైఎం నాయకులు నారాయణదాస్ నాగరాజు, చింతకుంట్ల వెంకన్న,బీఎస్పీ నాయకులు కొండగడుపుల నవీన్, వైయస్సార్ టిపి నాయకులు కొండ విజరు కుమార్, పాల్వాయి సందీప్, ఎల్లబోయినశ్రీకాంత్, నరేష్, మధు, సాయి, నితిన్, మహేష్ పాల్గొన్నారు.