Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా పోలీస్ శాఖలో డీసీఆర్బీ డీిఎస్పీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డీిఎస్పీ రవీందర్ హైదరాబాద్ జెన్కో డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ రంగనాథ్ జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో (డిసిఆర్బీ).విభాగం సిబ్బంది ఆయనను మంగళవారం శాలువా, పూలమాలలు, బొకేలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జిల్లాలో సీఐగా, డీఎస్పీగా సమర్ధవంతంగా సేవలందించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ మధు, సిబ్బంది సోమశేఖర్, వరలక్ష్మి, విజయ, మహబూబ్ అలీ, వెంకటేశ్వర్లు, ముక్తార్ మొహియుద్దీన్, సైదులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, రమణ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.