Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రగతి సమీక్షసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధిపనులపై ఎమ్మెల్యే నోములభగత్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలోకలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ వివిధ శాఖల అధికారులతో పనులపై సమీక్షించారు.మినీస్టేడియం, ఇంటిగ్రేటెడ్,వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, షాదీఖానా,వైకుంఠదామాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ బి.రోహిత్‌సింగ్, మున్సిపాలిటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పార్వతమ్మ శంకరయ్య, తహసీల్దార్ మంగ, కమిషనర్ వేమన్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, వైస్‌చైర్మెన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్, అన్నెపాక శ్రీను, కోఆప్షన్ సభ్యులు చాపల సైదులు, సమీనాఅన్వరుద్దీన్, డోమ్నిక్, రావులలక్ష్వమ్మ, లింగయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.