Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి అరెస్టు..వాహనం స్వాధీనం
నవతెలంగాణ-దేవరకొండ
నియోజకవర్గంలోని చెర్కుపల్లి-డిండి రహదారి మార్గంలో నల్లబెల్లం, పట్టికను తీసుకెళుతున్న వాహనాన్ని పట్టుకొని ఒకర్ని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశామని ్ల ఎక్సైజ్ సీఐ వెంకటేశ్ తెలిపారు.మంగళవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించగా డిండి మండలం కుందేలువాయితండా, చామల బావితండాల్లో మూడు కేసులు నమోదు చేసి టాటాసఫారీ వాహనాన్ని సీజ్ చేశామన్నారు.ఏపీ 09 బీఈ 1333 నెంబర్ గల వాహనంలో 480 కిలోల నల్లబెల్లం, 60 కిలోల పట్టిక, 25 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.అనంతరం ఆ తండాలో వంద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని తెలిపారు.బెల్లం తరలిస్తున్న ముగ్గురు పెద్దతండాకు చెందిన ముడావత్ నవీన్, కాట్రావత్ బాలు, కాట్రావత్ రమేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు.బెల్లం సరఫరా చేస్తున్న వారిని, తయారు చేస్తున్న వారిని బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.