Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని ప్రధానసెంటర్లో రాస్తారోకో నిర్వహి ంచారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ అనూష మతికి కారకులైన అనూష పెదనాన్న పైడిమర్రి నాగేష్, పెద్దమ్మ పైడిమర్రి సమాధానం, బాబారు పైడిమర్రి విజరు, వజ్రమ్మ, పెదనాన్న కుమారుడు అంజిపై 306 కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నకలు ఇవ్వాలని కోరారు.అనూష మతదేహంతో నేరేడుచర్ల ప్రధానసెంటర్లో ధర్నా నిర్వహించారు.అనూష మతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సోమవారం హుజూర్నగర్కు తరలించగా మంగళవారం ఉదయం ఫత్తేపురం గ్రామానికి చెందిన ప్రజలు నేరేడుచర్లకు చేరుకొని ఐదుగురు మీద పిటిషన్ ఇస్తే నలుగురు మీదనే కేసు చేసి ఒకర్ని వదలడం ఏంటని ప్రశ్నించారు.సోమవారం పిటిషన్ ఇచ్చినప్పుడు ఐదుగురి మీద కేసు చేస్తామని చెప్పారని హుజూర్నగర్ సీఐ నేరేడుచర్ల స్టేషన్కు వచ్చి వెళ్లిన తర్వాత ఒకర్ని తప్పించడం ఏంటని మృతురాలి చెల్లెలు సుధా ప్రశ్నించారు.కారకులైన ఐదుగురు మీద కేసు నమోదుచేయాలని పట్టుబట్టారు.మతదేహంతో రోడ్డు మీదనే గంటల తరబడి ధర్నా నిర్వహించడంతో మూడు గంటలు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.నేరేడుచర్ల గరిడేపల్లి,పాలకవీడు ఎస్సైలు విజరుప్రకాష్, వెంకన్న నరేష్, పోలీసు బందోబస్తు నిర్వహించారు.