Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-వేములపల్లి
రాజకీయాలకతీతంగా శక్తివంచన లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పుట్టల సునీత కపయా అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజాప్రతినిధులు ఏ సమస్య వచ్చినా తన నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పినట్టయితే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.పార్లమెంట్‌ను తలపించేలా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్నారు.సభలో ప్రభుత్వపాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని, స్కావెంజర్స్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.మండలంలోని పాఠశాలలో మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.అంగన్‌వాడీకేంద్రాల్లో సన్నరకం బియ్యం అందించాలని అందించాలని కోరారు.లబ్దిదారులందరికీ సన్నరకం బియ్యం అందేలా ప్రభుత్వంతో మాట్లాడ్తానన్నారు.2018 నుండి నేటి వరకు మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ లేని రుణాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వేములపల్లి సహకార సంఘానికి గోదాముల నిర్మాణానికి స్థలం అందించడానికి సహకారం అందిస్తానన్నారు.సభలో ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో రేషన్‌కార్డు లేని వారు చాలామంది ఉన్నారన్నారు. ప్రభుత్వం కొంతమందికే రేషన్ కార్డులు అందించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థన మాట్లాడుతూ మొల్కపట్నంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ప్రారంభించలేదన్నారు. అదేవిధంగా ప్రతి చిన్న గాలి,వానకు విద్యుత్ అంతరాయం కలగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పాధూరి గోవర్ధన శశిధర్‌రెడ్డి, ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య ప్రణీత్‌రెడ్డి, ఎంపీటీసీ పల్లా వీరయ్య, పీఏసీఎస్ చైర్మెన్ జేర్రిపోతుల రాములుగౌడ్, సీఈవో రవీందర్రావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
హాజరుకాని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
మంగళవారం మండల పరిషత్ కార్యాలయ నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నారని తెలియడంతో మండలంలోని టీఆర్ఎస్కు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు జెడ్పీటీసీ హాజరుకాలేదు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచ్ ఒక్కరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.ఏడుగురు ఎంపీటీసీలగాను కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, ఎంపీపీ వైస్‌ఎంపీపీ మాత్రమే హాజరయ్యారు.