Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని గ్రామాలలో విద్యుత్ సమస్యలే అధికం
- చెక్కులపై ఉపసర్పంచులు సంతకం చేయట్లేదు
- అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావు: ఎంపీపీ
నవతెలంగాణ-మర్రిగూడ
గత సర్వసభ్య సమావేశంలో సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు నేటి సమావేశానికి కూడా పరిష్కారానికి నోచుకోలేదంటూ పలు గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులపై ధ్వజమెత్తారు.బుధవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.అధికారులు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయని ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించకపోతే విద్యుత్ బిల్లులు చెల్లించేది లేదని సర్పంచ్ కొర్ర శ్రీను.శివన్నగూడ,కొట్టాల గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చేద్దామంటే ఉప సర్పంచులు సహకరించకుండా చెక్కులపై సంతకం చేయడం లేదని ఆయా గ్రామాల సర్పంచులు ఆరోపించారు.బంగారం తాకట్టు పెట్టి పనులు చేసిన బాధలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఐకేపీ (వెలుగు) కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికి ఎంత రుణం ఇస్తున్నారు.. ఏ సమావేశానికి కనీసం సర్పంచ్ ఆహ్వానించడం లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని సర్పంచులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఉపాధిహామీ చట్టంలో దినసరి కూలీ రూ. 240 కాకుండా రూ.100 నుంచి రూ.150 వస్తున్నాయని,100రోజులు మాత్రం పూర్తయ్యేసరికి కనీసం కుటుంబానికి రూ.10 వేలు కూడా అందడం లేదన్నారు.యరగండ్లపల్లిలో గతంలో 290 ఇళ్లస్థలాలు కేటాయించినప్పటికీ అర్హులకు ఇళ్ల పట్టాలు అందలేదని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హత కలిగిన వారికి అందించాలని గ్రామసర్పంచ్ మాడెం వెంకటమ్మ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు.మధురనగర్‌లో ఉన్న పోలింగ్‌బూత్‌ను సైతం మర్రిగూడకు మార్చాలని సర్పంచ్ నల్ల యాదయ్య కోరారు.సర్వసభ్య సమావేశానికి వచ్చామా. చెప్పామా! వెళ్ళామా?అనే చందంగా వ్యవహరిస్తున్నారు తప్ప అధికారులకు చిత్తశుద్ధి కరువై ఇబ్బందులను పట్టించుకోవడం లేదని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ధ్వజమెత్తారు.స్పందించిన ఎంపీపీ మాట్లాడుతూ అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారంకావని చెప్పడంతో ప్రజాప్రతినిధులంతా నివ్వెరపోయారు.ఎంపీడీవో రమేశ్దీనదయాల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్యనాయక్, ఎంపీఓ ఝాన్సీ,ఏవో స్పందన,ఎంఈఓ గుర్వారావు, ఎంఓ రాజేష్,ఏఓలు రాజేష్, వెంకటేశ్వర్లు,అనిల్‌రెడ్డి, హెచ్ఓ శ్వేత, సూపర్వైజర్లు విజయలక్ష్మీ, పద్మ, ఏపీఎం అశోక్, ఈసీ వివేక్, వివి.యాదగిరి పాల్గొన్నారు.