Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
మూసీప్రాజెక్టు ఏఈ మమత వల్ల తా పురుగుల మందుతాగి చచ్చేపరిస్థితి వచ్చిందని మండలంలోని కల్వలపాలెం గ్రామానికి చెందిన రైతు సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.తమ వ్యవసాయ భూమి 1963లో మూసీకాలువ నీళ్ల కోసం 9 గుంటల భూమిని ప్రభుత్వానికి ఇచ్చామని పేర్కొన్నారు.అప్పటినుంచి ఇప్పటివరకు నీళ్లు రాకపోవడంతో కాల్వ కింద ఉన్న రైతులందరూ భూమిని కలుపుకుని సేద్యం చేస్తున్నారన్నారు.ఇప్పుడు మూసీ ఏఈ మమత ఓ భూస్వామి దగ్గర లంచం తీసుకొని తన భూమిలోకి వెళ్ళడానికి దారి కోసం తమ 9 గుంటల భూమిని 24 గుంటలుగా మార్చి మమ్మల్ని పదేపదే ఇబ్బందులకు గురి చేస్తున్నదని వాపోయారు.భూస్వామి కుటుంబానికి, తమకు మధ్య కక్షలు పెంచుతూ పలుమార్లు భూమి వద్దకు వచ్చి భూతగాదా గొడవలకు కారకుల వుతుందన్నారు.తమకు చట్టపరమైన ఆధారాలు ఉన్నా.. లెక్కచేయకుండా తమపై దౌర్జన్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు,కలెక్టర్ స్పందించి ఈ విషయంపై విచారించి ఏఈ మమతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.