Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశ్వర్ మూవీమహల్లో ''రైతన్న'' చిత్రాన్ని వీక్షించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-తకేంద్ర
ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాల ద్వారా వచ్చే పరిణామాలు,వాటి వల్ల కలిగే లాభ,నష్టాలను రైతన్న సినిమా ద్వారా ఆర్.నారాయణమూర్తి అద్భుతంగా చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.సమాజహితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కషి చేయడమనేది చూస్తుంటామన్నారు.ఇలా సినిమా మాద్యమం ద్వారా ఎన్.శంకర్, నారాయణమూర్తి వంటి వారు ఎక్కువగా కషి చేస్తుంటారన్నారన్నారు.నారాయణమూర్తి తనకు తెలిసిన గంభీరమైన పద్ధతుల్లో కొత్త రైతుచట్టాల ద్వారా కలిగే లాభ,నష్టాలపై రైతులను మేల్కొలపడానికి రైతన్న సినిమా ద్వారా చేసిన ప్రయత్నం అద్భుతమని కొనియాడారు.దశాబ్దాలుగా గత పాలకుల చేత దగాపడిన రైతులను ఆదుకోవడానికి నేడు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతుబీమా వంటి పధకాలను కొత్త చట్టాల వల్ల ఎలా నిర్వీర్యం చేస్తాయో, కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసే సన్నివేషాలను కళ్ళకు కట్టినట్టు చూపించారన్నారు.మంత్రితో సినిమాను వీక్షించిన వారిలో మున్సిపల్ చైర్మెన్ పెరుమళ్ళ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మలశ్రీనివాస్గౌడ్, జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, జెడ్పీటీసీ జీడి భిక్షం, పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిశోర్,జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య,మార్కెట్ చైర్మెన్ ఉప్పలలలితఆనంద్, డైరెక్టర్లు రమణారెడ్డి, దాచేపల్లి భరత్, సల్మా, ఊట్కూరు సైదులు, పలువురు కౌన్సిలర్లు చింతలపాటి భరత్ మహాజన్, భాషామియా, అనంతులయాదగిరి, రాపర్తిశ్రీనివాస్, అన్నెపర్తి రాజేష్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు,మూవీ మహాల్ నిర్వాహకులు చెనగాని రాంబాబు, పల్సవెంకన్న, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, రేపాల పాండు, రమాకిరణ్ ఉన్నారు.