Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని కుడకుడ గ్రామంలో గౌడ సంఘం సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతిని జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడసంఘం మాజీ జిల్లా అధ్యక్షులు పంతంగి శ్రీను, గౌడ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉయ్యాల నగేష్,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పంతంగి దశరథ, బూర రవి, లక్ష్మయ్య, నాగయ్య, నర్సయ్య,రాములు, నాగరాజు, రాజు, సతీష్, చంటి, సోమయ్య, ఉప్పలయ్య, కష్ణ, మహేందర్, చంద్రయ్య, విష్ణు, జానయ్య పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్వాయిపాపన్న చిత్రపటానికి గౌడ సంఘం మండల అధ్యక్షులు పోలిశెట్టి సైదులుగౌడ్, కవి బెల్లంకొండ శ్రీరాములుగౌడ్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో చామకూరి సైదులు, చెనగాని అంజయ్య, దేశగాని లక్ష్మణ్, బెల్లంకొండ గురవయ్య, తండు నాగరాజు, చామకూరి లింగస్వామి, మామిడి వెంకన్న, సైదులు, మామిడి గురవయ్య పాల్గొన్నారు.
కోదాడరూరల్ :పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి కార్యక్రమం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.బహుజన రాజ్యం కోసం వందల ఏండ్ల కింద పోరాటం చేసి భువనగిరిఖిల్లాపై స్వతంత్ర బహుట ఎగరేసిన బహుజన విప్లవ కారుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంపేట ఉపేందర్‌గౌడ్, సోమగాని సోమేశ్గౌడ్, సత్యనారాయణగౌడ్, సురగాని రాంబాబుగౌడ్, గౌడసంఘం నాయకులు జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండసైదయ్య, సొసైటీచైర్మెన్ రాజేష్, పట్టణ అధ్యక్షులు నాగేశ్వరావు ,టీిఆర్‌ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్,కేఎల్ఎన్.ప్రసాద్, అల్వాల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు లింగయ్య, నాగరాజు, నాయకులు గుండు పరుశరాములు, కొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండలకేంద్రంలో గౌడసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితారాములుగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేశ్‌గౌడ్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, నాయకులు తునికి సాయిలు, అంజయ్యగౌడ్, రాములుగౌడ్, గడ్డంఉప్పలయ్య, గోపగాని శ్రీను, వీరసోములు,సుధాకర్, వెంకన్న పాల్గొన్నారు.
దేవరకొండ :మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు లోకసాని శ్రీధర్‌రెడ్డి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్‌గౌడ్, ఉపసర్పంచ్ పగిళ్ల శ్రీనివాసులు, వంగూరిరాజు, మాజీ ఉపసర్పంచ్ కడారి పెద్దఎల్లయ్య, చింతపల్లిలక్ష్మయ్య, చింతపల్లి నర్సింహ, వంగూరి నారయ్య, చింతపల్లి శివకుమార్,యాదయ్య, లచ్చయ్య, బాలరాజు, వెంకటయ్య, మల్లయ్య, శేఖర్ పాల్గొన్నారు.
చింతపల్లి : బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ గీత కార్మికుల మండలాధ్యక్షులు అనంత వెంకటేష్ గౌడ్ అన్నారు. పాపన్న జయంతిని మండలంలోని తెలంగాణ గౌడ గీత వత్తి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడ సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ మండల చైర్మన్ అనంతుల వెంకటయ్య గౌడ్, సాయి రెడ్డి గూడెం సర్పంచ్ కేశగోని రవీందర్ గౌడ్, కుర్మేడ్ ఎంపీటీసీ శ్వేతా శ్రీశైలం గౌడ్, కుర్మేడు గౌడ సంఘం చైర్మన్ రవి గౌడ్, సింగిల్‌విండో డైరెక్టర్ బాలు, జంగయ్య గౌడ్, నిరంజన్ గౌడ్, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేల్వల పెళ్లి ఉపసర్పంచ్ వినోద్,గౌడ్. యాచారం యాదయ్య గౌడ్ వైస్ ఎంపీపీ ఎంఆర్పిఎస్ వింజమూరు కష్ణయ్య పాల్గొన్నారు.
కురుమేడులో...మండలంలోని కుర్మేడ్ గ్రామంలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు.ఈ కార్యక్రమలో కుర్మేడ్ ఎంపీటీసీ కుంభం శ్వేత శ్రీశైలం గౌడ్, మండలాధ్యక్షుడు హనుమంతుల వెంకటేష్ గౌడ్, కుర్మేడ్ గౌడ సంఘ అధ్యక్షుడు రవి, మాజీ సర్పంచ్ జంగయ్య, మహేష్, నరసింహ, కుంభం వెంకటయ్య, శేఖర్, పెంటయ్య, కుంభం మహేష్, కుంభం జంగయ్య, కుంభం శ్రీశైలం, అల్వాల చింటూ పాల్గొన్నారు.