Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలో విషపూరితమైన దోమలతో ప్రజలకు దద్దుర్లు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దోమలు కరిచిన చోట దూరద, మంటలేచి చేతితో గోకడంతో అది ఇతర ప్రాంతానికి విస్తరిస్తున్నట్టు ప్రజలు వాపోతున్నారు .12 వ వార్డు లో రంగనాయక గుడి సమీపంలో రాయగిరి శివప్రసాద్ గుడిముందు కూర్చోగా దోమలు కరవడంతో దద్దుర్లు లేచాయని, దద్దుర్ల వద్ద రుద్దితే కాలుపై బుగ్గలు విస్తరిస్తున్నాయని వాపోయాడు .ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి దాదాపు నెల రోజులలో 20 కేసుల వరకు ఇలాంటవి వచ్చినట్టు తెలుస్తోంది . వైద్య ప్రభుత్వ వైద్య బందం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా కోసం చూడాలని ప్రజలు కోరుతున్నారు. లేదా క్యూలెక్స్, ఎనాఫిలస్ దోమల ద్వారా విష జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున మున్సిపల్ అధికారులు పాలక వర్గం డ్రయినేజీని శుభ్రం చేసి దోమలను నివారించాలని కోరుతున్నారు.