Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్రంలో కల్లు గీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం పార్టీలకతీతంగా అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న.పిలుపునిచ్చారు.యోధుల యాదిలో కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఏడవ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కల్లుగీత కార్పొరేషన్‌కు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, ప్రతి సొసైటీకీ పది ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉప్పల గోపాలు, నేలపట్ల నరసింహ , రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ,విష్ణు గౌడ్, పంతంగి సైదులు, అంతటి శ్రీనివాస్ గౌడ్, బెజవాడ జగన్, మారగోని నగేష్, రావుల మారయ్య, మారగోని అంశమా, మారగోని పద్మ, పుల్లెంల లక్ష్మమ్మపాల్గొన్నారు.