Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్‌లో తలపెట్టిన శంఖారావం సభకు కార్మికులు ఊరుకో బండితో హుజురాబాద్‌కు రావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు కోరారు. బుధవారం పట్టణకేంద్రంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలన్నారు. దళితుల ఎక్కువమంది పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాయ కష్ణ.నాయకులు బట్టు కొండయ్య, ఆడకు వెంకటేశం, శాంతమ్మ, వరమ్మ, సుమతి, లక్ష్మి, కుమారి పాల్గొన్నారు.