Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
దళితుల పట్ల బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తున్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి విమర్శించారు.శుక్రవారం ఆ సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేస్తున్న ఆశీర్వాదయాత్ర సందర్భంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలోని చింతలచెరువు దళితవాడలో గల దళిత పారిశుధ్య కార్మికురాలు మెరుగు మార్తమ్మ ఇంటికి అల్పాహారం తీసుకోవడం కోసం రావడమంటే బీజేపీ దళితులకు చేస్తున్న అన్యాయాలను కప్పి పుచ్చుకోవడమేనని విమర్శించారు. పారిశుధ్యకార్మికుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలని కోరారు.జాతీయస్థాయిలో కరోనా వారియర్ అవార్డు పొందిన కార్మికురాలు ఇంటికి వెళ్లి కనీసం ప్రభుత్వం వైపు నుండి వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కనీస ప్రకటన కూడా చేయకపోవడం సిగ్గు చేటన్నారు.బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో 300 రేట్లు దాడులు దళితులపై ఈ కాలంలో జరిగాయని విమర్శించారు.దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు జె.నర్సింహారావు, బత్తుల వెంకన్న, కొండేటి ఉపేందర్, పుల్లూరిజై పాల్గొన్నారు.