Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఈనెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ రిలేనిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని పాతబస్తీలోని 12,28 వార్డులలో మాధవ నగర్ ,హనుమాన్ నగర్లో ఇంటింటిసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నివసించే పేదవారికి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 31న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరిక అంజమ్మ ,మామిడి గాలయ్య లక్ష్మమ్మ ,కొండల్ మారమ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.