Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
హర్యానాలోని కర్నాల్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ ప్రభుత్వం పోలీసుల చేత లాఠీఛార్జి చేయించడం దారణ మని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హర్యానా రాష్ట్రంలోని కర్నల్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకం గా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల పై అక్కడి కలెక్టర్ స్వయంగా పోలీసులను ఉసిగొల్పి లాఠీఛార్జి చేయిం చడం హేయమైన చర్య అని అన్నారు. పోలీసు దెబ్బలకు తట్టుకో లేక అక్కడి నుండి తప్పించుకొని పోతున్న రైతులను వెంటబడి మరీ చితకబాదడం బాధాకరమని అన్నారు. రైతు చట్టాలకు వ్యతి రకంగా ఢిల్లీలో 9 నెలలుగా శాంతియు తంగా ఆందోళన చేస్తున్న రైతుల గురించి పట్టించుకోకపోవడం సరికాదన్నారు.