Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - మాడ్గులపల్లి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేస్తుంది ప్రజా చైతన్య యాత్ర కాదని, అది ప్రజా వంచన యాత్ర అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కుక్కడం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసరాల ధరలూ విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనం గా కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుం టూ ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మం డల కార్యదర్శి రొండి శ్రీనివాస్, శశిధర్రె డ్డి, అశోక్‌రెడ్డి, ప్రణిత్‌రెడ్డి, నారాయణ రెడ్డి, నాగయ్య, వెంకన్న పాల్గొన్నారు.