Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి.జహంగీర్
సీపీఐ(ఎం)లో 20 మంది చేరిక
నవతెలంగాణ -అడ్డగుడూర్
రాష్ట్రంలో ఏం సాధించారని, ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ పాదయాత్ర చేస్తుందని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి సమాధి కట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కోటమర్తి గ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 20మంది సీపీఐ(ఎం)లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ఆధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో దేశ సంపదను కార్పొరేట్శక్తులకు అమ్మి, దేశాన్ని అంధకారంలోకి నెట్టిందన్నారు. మునుపెన్నడు లేని మతఘర్షణలు సృష్టించినందుకు, డీిజిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను భూమికి దూరం చేసే వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతు బల్వన్మరణాలకు కారణమైనందుకు పాదయాత్ర చేస్తున్నారాని ప్రశ్నించారు. .తెలంగాణలో పోరాట వారసత్వం కలిగిన బీజేపీని ప్రజలు విశ్వసించరన్నారు. ఏ రాజకీయ పార్టీ పాదయాత్ర చేసినా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలి కానీ ప్రజల మధ్య సంఘర్షణ లాగ ఉండొద్దు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు సెప్టెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. 6వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు చేపడుతామని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజలు పోరాటాలకి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల నాయకులు బుర్రు.అనిల్ కుమార్ ,మండల నాగేశ్వరరావు, భూపతి నర్సయ్య,చిపల్లపెలి అందీప్ తదితరులు పాల్గొన్నారు.