Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్రంలో వ్యవసాయమే జీవనాధారంగా అధిక శాతం ఉన్న మున్నూరుకాపులకు రాష్ట్రప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ గణేశ్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి పోరెడ్డి శ్రీనివాస్, యువక మండలి రాష్ట్ర కార్యదర్శి పంతం క్రిష్ణ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేలుగల కుమారస్వామి, నాయకులు కందుల యాదగిరి, ఎలుగల ఆంజనేయులు, ఎలు గల వంశీ , పగడాల రాంబాబు,పత్తి రాములు,ఎలుగల స్వామి, తదితరులు పాల్గొన్నారు.