Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ భుజంగరావుకు ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఘనంగా వీడ్కోలు పలికారు. నూతనంగా వచ్చిన ఎసీపీ శ్రీనివాసరెడ్డి, పట్టణఇన్స్పెక్టర్ సుధాకర్‌తో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు కానిస్టేబుల్ పుష్పగుచ్చాలు, శాలువాలతో, జ్ఞాపికలతో సన్మానించారు. పోలీస్ స్టేషన్ నుండి గేట్ వరకు పూల వర్షం కురిపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా భుజంగరావు పలువుర్ని పేరు పేరునా పలకరిస్తూ కరచాలనం చేశారు. తన విధి నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు.
ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఏసీపీగా శ్రీనివాస్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పోలీసు సిబ్బంది అతనికి స్వాగతం పలికారు.
డీసీపీ భుజంగరావును కలిసిన వివేకానంద
భువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ భుజంగరావు భువనగిరి నుండి వీడ్కోలు సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కొలుపుల వివేకానంద పుష్పగుచ్ఛం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారు.