Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య , పట్టణకార్యదర్శి శీలరాజయ్య,మండల కమిటీ సభ్యులు రుద్రారం పెద్దలు, ఐతరాజు నర్సంహా జిట్ట సరోజ, జిట్ట స్వామి, జిట్ట రమాదేవి, ఐతరాజు యాదయ్య డివైయఫ్ఐ మండలసహాయకార్యదర్శి భూరుగు గోపి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కన్వీనర్ అయితరాజు నరసింహ ,ఉరుమడ్ల గ్రామశౄఖకార్యదర్శి బలిజ మల్లయ్య యాదవ్ ,కూరపాటి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.