Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ -వలిగొండ
దేశంలో కుల వ్యవస్థ అంతమయ్యేవరకు దేశం అభివద్ధి చెందదని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. మంగళవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులను మండల కేంద్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కుల వ్యవస్థను కూకటివేళ్లతో తీసేయడానికి ప్రతి పౌరుడు పై బాధ్యత ఉంద న్నారు. కులం, మతం శాస్త్రీయ పరిశీలన అనే అంశంపై వికలాంగులకు అవగాహన కల్పించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముత్యాల యాదయ్య శాస్త్రీయ ఆలోచన సమాజ పరిణామ క్రమం అనే అంశంపై బోధించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు స్వరూపంగ ప్రకాష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి బొల్లేపల్లి స్వామి, మహిళా కన్వీనర్ కొత్త లలిత ,కో కన్వీనర్ పద్మ ,మండల నాయకులు ఎర్ర బజార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్యాంసుందర్, జహంగీర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.