Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నాంపల్లి
ప్రజాసమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ కార్యకర్తలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం మండలకేంద్రంలో పార్టీ ఏడో మండలమహాసభ నాయకులు వాసిపాక ముత్తిలింగం,ఇరిగి అలివేలు అధ్యక్షతన నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నా సంపద మొత్తం సంపన్నుల చేతిలోనే కేంద్రీ కరించబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన కంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి దేశ సంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు.ఇటీవల తెచ్చిన రైతు, కార్మిక వ్యతిరేకచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రశ్నించే గొంతులను అణిచి వేసేందుకు, రాజద్రోహం వంటి నిర్బంధచట్టాలను ఉపయోగిస్తున్నారని విమర్శి ంచారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మతం పేరుతో దేశ భక్తి ముసుగులో కార్పొరేట్ల సేవలో నరేంద్రమోడీ తరిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతో పిట్టలదొర కాలం గడుపుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి సర్వే నిర్వహించి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగాన్ని సమీకరించి పెద్దఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. మండల ప్రజలకు సాగు, తాగునీరందించే కిష్టారాంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభలో మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు కొమ్ములక్ష్మయ్య, నాంపల్లి రమణ, గడ్డం గురుమూర్తి, చెట్టుపల్లి నాగభూషణ్, ఇరిగి వెంకన్న, కొమ్ము ముఖేష్, కుందేళ్ళ పర్వతాలు, ఆకారంశేఖర్, ఆకారం లక్ష్మయ్య, ఆకారంకాశయ్య, కొమ్ముకొండలు,నాంపల్లిశంకర్,గాదెపాకమధు, కామిశెట్టి శ్రీకాంత్, ఎర్రసైదమ్మ, భూతం కలమ్మ పాల్గొన్నారు.