Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుర్రంపోడు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి,వర్థంతిలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశంగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ ఆ రోజులలో భూమికోసం, భుక్తి కోసం నిజాం నవాబుతో దేశ్ ముక్కులతో వీరపోరాటం సల్పిన ధీరవనిత అని కొనియాడారు.చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రతి మండలకేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.చాకలిఐలమ్మ పోరాటస్ఫూర్తిని గుర్తించి ఆమె జయంతి,వర్థంతిలను అధికారికంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రజకసంఘం మండలయువజన అధ్యక్షులు ముష్టిపల్లిలింగస్వామి,టీఆర్ఎస్ చామలేడు గ్రామశాఖ అధ్యక్షుడు పగిళ్ళ రమేష్,పగిళ్లశేఖర్, ఎస్ఎంసీ చైర్మెన్ షేక్ జాకీర్, షేక్సద్దాం పాల్గొన్నారు.
హుజూర్నగర్ : రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్లో సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్,మున్సిపల్ వైస్చైర్మెన్ జక్కులనాగేశ్వరరావు, రజక సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకర మైనదన్నారు.దీంతో రజకులకు 250 యూనిట్లవరకు ఉచిత కరెంటు ఇవ్వడం కూడా హర్షించదగిన విషయమన్నారు.ఈ కార్యక్ర మంలో రజక సంఘం నాయకులు దాసరి నారాయణ, దుగ్గి గురువర్మ, ఎం.సత్య నారాయణ,టీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చిట్యాల అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండలకేంద్రంలో రజకసంఘం ఆధ్వర్యంలో సీఎంకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూసపల్లి శ్రీనివాస్, వడ్లకొండ వెంకన్న, అక్కెనపల్లి రాములు, ఆమనగంటి నగేష్,వడ్లకొండసైదులు, నారా యణ దాసు శ్రీను, భద్రయ్య, వెంకన్న పాల్గొన్నారు.
మిర్యాలగూడ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండవర్గాల ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి, (సెప్టెంబర్ 26,1895) వర్ధంతులను (సెప్టెంబర్ 10,1985) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు.