Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిఘా నీడలో మండపాలు
అ జిల్లాలో 2,000 వరకు విగ్రహాల ఏర్పాటు
అ మండపాలన్నింటిని జియో ట్యాగింగ్
నవతెలంగాణ-నల్లగొండ
వినాయక నవరాత్రులలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేశారు. నల్గొండ జిల్లా పోలీసులు, మండపాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇచ్చిన పోలీస్ శాఖ ప్రతి మండపం వద్దకు వెళ్లి జియో ట్యాగ్ చేస్తున్నారు. ఇలా ట్యాగ్ చేసిన విగ్రహాలకు ఒక నెంబర్ కేటాయిస్తున్నారు. ఇలా ట్యాగ్ చేసిన మండపం మ్యాప్ పై ఒక్క క్లిక్ చేస్తే చాలు. రూట్ మ్యాప్, నిర్వాహకుల వివరాలు మొత్తం కనిపిస్తాయి. ఏమండపం వద్ద అయినా గొడవ జరిగితే పోలీసుల వద్ద ఉండే ట్యాబ్‌లో క్లిక్ చేయడం ద్వారా సులువుగా, త్వరగా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. అంతే కాదు నిమజ్జనం చేసిన విగ్రహాల వివరాలు యాప్ నుండి తొలగిపోతాయి. ఇలా గణేష్ నవరాత్రులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ మరింత ఇస్మార్ట్ గా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంది నల్లగొండ పోలీస్‌శాఖ.
జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగ్ చేసే దిశగా చర్యలు ప్రారంభించిన పోలీసులు సంబంధిత వినాయక మండపాల నిర్వాహకుల సమగ్ర సమాచారం, ఫోన్ నెంబర్లతో సహా ట్యాబ్‌ల ద్వారా పొందుపరిచారు. పాయింట్ బుక్ లు ఆన్ లైన్ లో...
గతంలో పోలీసులు అన్ని గణేష్ మండపాల వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి ఎదో ఒక సమయంలో అక్కడకు చేరుకుని పాయింట్ బుక్ లో సంతకం చేస్తే మా పని అయిపోయింది అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి పోలీస్ కదలికను సైతం ఆన్ లైన్ చేసింది పోలీస్ శాఖ... పోలీసులకు కేటాయించిన నూతన వాహనాల్లో జిపిఎస్ సిస్టం ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల కదలికలు ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2,000 లకు పైగా విగ్రహాలకు పైగా ప్రతిష్టించగా అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఇలా ప్రతి విగ్రహం వద్ద పోలీసులకు కేటాయించిన పాయింట్ బుక్ సంబంధిత స్టేషన్ ద్వారా నిర్దేశించిన జిపిఎస్ కలిగిన వాహనం ద్వారానే కాకుండా మండపాన్ని సందర్శించే పోలీస్ అధికారి తన వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా ఆన్ లైన్ లో సందర్శించినట్లు నమోదు చేయాలి. సంబంధిత ట్యాబ్ లో ఉన్న గూగుల్ మ్యాప్ ద్వారా ఆ అధికారి ఏ సమయానికి అక్కడికి చేరుకున్నారు, పాయింట్ బుక్ సందర్శించారా లేదా అనే వివరాలు వెంటనే తెలిసిపోతాయి. ఇలా ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగించే పరిస్థితులను కల్పిస్తూ పటిష్ఠంగా పనిచేస్తున్నారు.
పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర పర్యవేక్షణ : ఎస్పీ
జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాం. నిర్వహకులతో సమావేశం నిర్వహించి నవరాత్రులతో పాటు నిమజ్జనం రోజున పాటించాల్సిన జాగ్రత్తలను అందరికి అర్ధమయ్యే విధంగా తెలియజేస్తున్నాం. మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించాం. ప్రతి గణేష్ మండపం వద్ద శానిటైజర్ ఏర్పాటుతో పాటుగా చచ్చితంగా మాస్కులు ధరించిన వారినే అనుమతించేలా నిర్వహకులకు సూచనలు చేశాం.