Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
దళితులను మోసం చేసేందుకే కేసీఆర్ దళితబంధు పథకంతో మాయమాటలు చెపుతున్నాడని, ఆయన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, కాంగ్రెస్ నాయకులు కుం దూరు జానారెడ్డి తన యుడు జయవీర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం అధ్యక్షతన జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవసభ నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ జీఎన్వీ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ ఎన్నికలు గుర్తుకొచ్చినప్పుడే కేసీఆర్‌కు సంక్షేమపథకాలు గుర్తు కొస్తాయని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రజలందరికి అందించాలని కోరారు.సాగర్‌లో ప్రజాసమస్యలు కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, బ్లాక్ కాంగ్రెష్ అధ్యక్షులు భాస్కర్‌నాయక్, శేఖర్‌రెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శంకర్, సర్పంచ్ మేరెడ్డి పుష్పలత, ఎంపీటీసీ విశ్వనాథుల రాణిరమేశ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిత్రం మల్లయ్య, మండల వర్కింగ్ అధ్యక్షుడు కొండ శ్రీనివాస్‌రెడ్డి, ముంగి శివమారయ్య, పోలె రవి, మంజుల, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మన్నెంవెంకన్న, కంచర్ల రవీందర్‌రెడ్డి, పోతుగంటి కోటయ్య, పాల్వాయి దేవదానం పాల్గొన్నారు.