Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ ధరావత్ కుమారి బాబునాయక్
నవతెలంగాణ-చివ్వేంల
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ కోరారు. సోమవారం మండలంలోని పాచ్యనాయక్ తండాలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఉచిత వ్యాక్సిన్ సెంటర్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. 18 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లోనూ ఉచితంగా వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనాయక్ తండా సర్పంచ్ ధరావత్ రాజు, మెడికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, ఎంపీవో గోపి, పాచ్యానాయక్ తండా ఉపసర్పంచ్ విజయ శ్రీను, కార్యదర్శులు అరవింద్, మధు, ఏఎన్ఎంలు మమత, బిక్షమమ్మ, శంకరమ్మ, అనిత, ఆశా కార్యకర్త అరుణ, అనిల్, శంకర్, లక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్ : ప్రతి ఒక్కరూ కరోన వ్యాక్సిన్ వేయించుకోవాలని మండలంలోని రాజనాయక్ తండా సర్పంచ్ అశోక్‌కుమార్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని రాజానాయక్ తండా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సిన్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్‌చంద్ర, ఎంపీటీసీ శాంతాబాయి, పాండునాయక్, వార్డు సభ్యులు విజరు, శారదా జలంధర్ తదితరులు పాల్గొన్నారు.