Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయిత వేముల ఎల్లయ్య
నవతెలంగాణ పుస్తక
ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పుస్తకాల వల్ల విజ్ఞానంతో పాటు ప్రశ్నించే తత్వం కూడా అలవడుతుందని ప్రముఖ కవి, రచయిత వేముల ఎల్లయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నల్లగొండలోని నవతెలంగాణ బుకహేౌస్‌లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రదర్శనలో కమ్యూనిస్టు భావజాలం కలిగిన పుస్తకాలతో పాటు అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుకహేౌస్ ఇన్చార్జీ రఘువరన్ మాట్లాడుతూ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా 10 పుస్తకాల సెట్‌ను 50 శాతం తగ్గింపుతో రూ.500కే విక్రయిస్తున్నట్టు తెలిపారు. పుస్తకమిత్ర కార్డుపై ఇతర పబ్లిషర్స్ పుస్తకాల కొనుగోలుపై 20 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 17వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ దినపత్రిక జిల్లా మేనేజర్ పి.మట్టయ్య, డెస్క్ఇన్చార్జి నిసార్బాబా, స్టాఫ్ రిపోర్టర్ గాదె రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్, సుకుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కే.శ్రీను, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.