Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
కమ్యూనిస్టుల పోరాటంతోనే తెలంగాణ విముక్తి చెందిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని పడమటిపల్లి గ్రామంలో సాయుధ పోరాట అమరవీరులు దేవరకొండ తాలూకా ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, మాజీ ఎమ్మెల్యే అమరజీవి పల్లా పర్వత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పల్లాకిష్టారెడ్డి, అల్లారి నర్సింహా, కిన్నెర రాములు, కాటం అంతయ్య, పల్లె దశరథం, పాత్లవత్ తండాలో పాత్లవత్ సత్తయ్య, పాత్లవత్ జాజ్ఞ, పాత్లవత్ భూత, బొడ్డుపల్లి కష్ణయ్య, ఎల్లారెడ్డి భావిలో మాజీ సర్పంచ్ సిపతి నారాయణరెడ్డి అమరవీరుల స్మారక స్తూపాలకు ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం సభలో మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐదు వేల మంది వీరుల రక్తంతో రక్తతర్పణ చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు.సాయుధ పోరాట కాలం నాటికి బీజేపీ దేశంలో పుట్టలేదన్నారు.సాయుధ పోరాటానికి మతం రంగు రుద్దుతూ తెలంగాణ పోరాటం గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.అనంతరం పాత్లవత్ తండా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి పార్లపల్లి కేశవరెడ్డి, సర్పంచ్ కిన్నెర యాదయ్య, మండల కార్యవర్గ సభ్యులు జూలూరి వెంకట్రాములు, గంగిడి రాంరెడ్డి,దేపా సుదర్శన్‌రెడ్డి,పందుల యాదయ్య, పల్లా రంగారెడ్డి గ్రామ కార్యదర్శులు పల్లా శేఖర్‌రెడ్డి,పాత్లవత్ గోపి నాయక్, సిపతి భూపాల్‌రెడ్డి, పాత్లవత్తండా ఉపసర్పంచ్ పాత్లవత్ రాజ్‌కుమార్,జక్కమాధవరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,మాజీ ఎంపీటీసీ పాత్లవత్ బద్దీ,కాటం గోవర్ధన్,అలమోని మల్లయ్య, కడారి నర్సిహ,ఉడుత జంగయ్య,బొడ్డుపల్లి అర్జున్, పల్లె శేఖర్, పల్లె మధు, ముడి రాజు, పల్లె లాలమ్మ,బొడ్డుపల్లి లక్ష్మీ, కావాలి చంద్రమ్మ, పల్లె స్రవంతి,మున్నీ, మావిళ్ళ వెంకటయ్య, సోమ్లా, భద్రు, లచ్చిరాం,కోట్య,భాస్కర్, దాసరి మహేష్, రమేష్, ఐమార్ తదితరులు పాల్గొన్నారు.