Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
'40 ఏండ్లనుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం..మరో పనిచేద్దామంటే మాకు ఓపిక లేదు. కిరాయి పెంచినా సరే షాపులు మాకే ఇవ్వాలి. అని నకిరేకల్ పట్టణంలోని 37 షాపులను చెందిన పేదలంతా మున్సిపల్ శాఖ అధికారులను వేడుకుం టున్నారు. కానీ కోర్టు మాత్రం బహిరంగ వేలం పాట నిర్వహిం చాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు అమలు చేయాలని మరోసారి స్పష్టం చేసింది. కోర్టు తీర్పును ఎవరూ తప్పు పట్టరని, దానికి అసెంబ్లీ స్థాయిలో నిర్ణయాలు జరిగితే తప్ప చిరువ్యాపారులకు న్యాయం జరగదని, దానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం ఉంటుందని కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు పేదల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. కానీ ఇంత వర కు పని పూర్తి చేయలేదు. డబ్బులు ఏమయ్యాయో.. లెక్కలు కూడా చెప్పడంలేదని చిరువ్యాపారులు ఆరోపిస్తున్నారు. నకిరేకల్ పట్టణంలోని 37 షాపులను వేలం పాట ద్వారా వ్యా పారులకు కేటాయించాలని కోర్టు తీర్పు చెప్పింది.
అప్పుడు అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్న వారికి నష్టం జరుగుతుందని, అందుకే అసెంబ్లీలో తీర్మానం చేయిస్తామని, దాని వల్ల మీకే సొంతంగా వాటిని కట్టబెట్టే అవకాశం వస్తుందని, దాని కోసం రూ.60లక్షలు ఇవ్వాలని వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. మొదటి విడతగా చిరు వ్యాపారస్తుల నుంచి దాదాపు రూ.28లక్షలు వసూలు చేశారు. మిగతా రూ.32 లక్షలు పని పూర్తయిన తర్వాత చెల్లించాలని తీర్మానం చేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారంతా అప్పులు తెచ్చి వారికి డబ్బులు ముట్టజెప్పారు.
పెద్ద వ్యాపారులకు అప్పజెప్పే కుట్ర...
అయితే గతం కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రంగా నకిరేకల్ మారిపోవడం వల్ల పెద్ద వ్యాపారుల కోసం షాపులను కేటాయించేందుకు పరోక్షంగా అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ షాపులపై కొంత మంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు తమకు కావాలని దృష్టి సారించినట్లు సమాచారం. అందువల్లే కాలయాపన చేస్తూ, అక్కడున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తే వాళ్లకు వాళ్లుగా వెళ్లిపోతారనే ఆలోచనతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని సమాచారం. చిరువ్యాపారులందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్తే వారికి ఎలాంటి భరోసా లభించలేదని తెలిసింది. దాంతో పెద్ద పెద్ద వ్యాపారులకు షాపులు కేటాయించేందుకు కుట్ర జరుగుతున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు వ్యాపారుల వస్తువులను బలవంతంగా బయటికి లాగేశారని సమాచారం. చిరువ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బులకు కనీసం లెక్కలు కూడా చూపడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఆ నలుగురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు
కవిత, చిరువ్యాపారి, నకిరేకల్
మా వద్ద నుంచి నాగరాజు, విఠలాచారి, నడికుడి వెంకన్న, సుగ్రీవులు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడెమో ఎమ్మెల్యే బంధువు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. డబ్బులు ఏం చేశారో చెప్పడంలేదు. పోలీసులు, మున్సిపల్ అధికారులు మా సామాన్లంతా రోడ్డుపై పడేస్తున్నారు. కనీసం కనికరం చూపించడం లేదు. మాకు న్యాయం చేయాలి. అప్పుడు అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్న వారికి నష్టం జరుగుతుందని, అందుకే అసెంబ్లీలో తీర్మానం చేయిస్తామని, దాని వల్ల మీకే సొంతంగా వాటిని కట్టబెట్టే అవకాశం వస్తుందని, దాని కోసం రూ.60లక్షలు ఇవ్వాలని వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. మొదటి విడతగా చిరు వ్యాపారస్తుల నుంచి దాదాపు రూ.28లక్షలు వసూలు చేశారు. మిగతా రూ.32 లక్షలు పని పూర్తయిన తర్వాత చెల్లించాలని తీర్మానం చేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారంతా అప్పులు తెచ్చి వారికి డబ్బులు ముట్టజెప్పారు.
పెద్ద వ్యాపారులకు అప్పజెప్పే కుట్ర...
అయితే గతం కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రంగా నకిరేకల్ మారిపోవడం వల్ల పెద్ద వ్యాపారుల కోసం షాపులను కేటాయించేందుకు పరోక్షంగా అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ షాపులపై కొంత మంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు తమకు కావాలని దృష్టి సారించినట్లు సమాచారం. అందువల్లే కాలయాపన చేస్తూ, అక్కడున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తే వాళ్లకు వాళ్లుగా వెళ్లిపోతారనే ఆలోచనతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని సమాచారం. చిరువ్యాపారులందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్తే వారికి ఎలాంటి భరోసా లభించలేదని తెలిసింది. దాంతో పెద్ద పెద్ద వ్యాపారులకు షాపులు కేటాయించేందుకు కుట్ర జరుగుతున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు వ్యాపారుల వస్తువులను బలవంతంగా బయటికి లాగేశారని సమాచారం. చిరువ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బులకు కనీసం లెక్కలు కూడా చూపడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఆ నలుగురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు
కవిత, చిరువ్యాపారి, నకిరేకల్
మా వద్ద నుంచి నాగరాజు, విఠలాచారి, నడికుడి వెంకన్న, సుగ్రీవులు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడెమో ఎమ్మెల్యే బంధువు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. డబ్బులు ఏం చేశారో చెప్పడంలేదు. పోలీసులు, మున్సిపల్ అధికారులు మా సామాన్లంతా రోడ్డుపై పడేస్తున్నారు. కనీసం కనికరం చూపించడం లేదు. మాకు న్యాయం చేయాలి.