Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
కులాంతర వివాహం చేసుకున్న జంటను ఎంఆర్పీఎస్ నాయకులు అండగా నిలిచారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందిన చాగంటి అనూషరెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సైనికపురి కాలనీకి చెందిన దేవరకొండ సందీప్‌లు కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో సోమవారం పెండ్లి చేసుకున్నారు. అనూషరెడ్డి తల్లిదండ్రులు, బంధువులు సందీప్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తుండడంతో వారు స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులను సంప్రదించారు. వారి సహకారంతో ఎస్పీ ఆర్.భాస్కరన్‌కు కలిసి ఘటన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు కనుకుంట్ల వెంకన్న మాదిగ,బోడ శ్రీరాములు మాదిగ, దాసరి వెంకన్న మాదిగ,గార కనకయ్య మాదిగ, ములకలపల్లి మల్లేష్ పాల్గొన్నారు.