Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
మామిడి సోమయ్య
నవతెలంగాణ - భువనగిరి
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించ నున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలిపారు. సోమవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించిన జర్నలిస్టులకు పలు రకాల హామీలు ఇచ్చిన కేసీఆర్ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. వరంగల్ ,హైదరాబాద్ నగరాల్లో అద్భుతమైన కాలనీలు కట్టిస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయలేదన్నారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేసీఆర్ దృష్టికి, అధికారుల దష్టికి తీసుకెళ్లామని అయినా పరిష్కారం కావడం లేదన్నారు. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వ వేధింపులు నిలిపివేయాలని, అతనిపై పెట్టిన కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొలుపుల వివేకానంద, ఉపాధ్యక్షులు ముత్యాల జలంధర్, నాయకులు రాజు, పాక జహంగీర్, చుక్క సురేందర్ పాల్గొన్నారు.