Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందజేస్తున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రూ. 12 లక్షల నూతన రుణాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక రుణాలు రైతులు రూ.కోటి వరకు తీసుకునే అవకాశం ఉందన్నారు. దీర్ఘకాలిక రుణాలు కింద . ట్రాక్టర్లు, హార్వెస్టర్, పౌల్ట్రీ ఫామ్, డెయిరీ ఫామ్ , ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిటీ తీర్మానించింది. దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించిన డీసీసీబీబ్యాంకు చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ బొడ్డుపలి గాలయ్య , ముత్యాల అంజయ్య, ఉప్పల కష్ణ, నీల్ల జంగయ్య ,బెల్లంకొండ పారిజాత శంకర్, సీలివేరి శేఖర్ యాదయ్య, శంకర్ ,వెంకటేష్ పాల్గొన్నారు.