Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్, జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సుమారు 54 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్లుగాపని చేసిన వారందరికీ 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అంతే కాకుండా వారి వేతనాల్లో కూత విధిస్తుందన్నారు. మున్సిపల్ కార్మికులకు జీవో 60 అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో 51ను ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సిబ్బందితో భర్తీ చేసి పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మామిడి సుందరయ్య, దశరధ, వెంకటరమణ, ధనియాకుల శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.