Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిశీలించి అర్హుల జాబితా ప్రకటించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తులను ఎంక్వయిరీ చేయాలని సోమవారం జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్‌కు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న తర్వాత పట్టణానికి పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని ఆశపడ్డా వారికి నిరాశే మిగిలిందని విమర్శించారు. సుమారు 10వేల మంది దరఖాస్తులు చేసుకొని ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే చేసుకున్న దరఖాస్తులన్నింటిని ఎంక్వయిరీ చేసి అర్వుల జాబితా ప్రకటించి అందుకనుగుణంగా స్థలం సేకరించి అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నగదు ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఎక్కడా అమలు జరపడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి, దండెంపల్లి సరోజ, మైల యాదయ్య, భూతం అరుణ, పోలె సత్యనారాయణ, సలివోజు సైదాచారి, రాంరెడ్డి పాల్గొన్నారు.