Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజావసరాలకు ఉపయోగించాల్సిన పైపులు
ప్రయివేటు దుకాణాలకు...
అ చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఫ్లోరోసిస్ నుండి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చౌటుప్పల్ మండలంలో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభించింది.కానీ నియోజకవర్గంలో ఇప్పటికీ ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందని ద్రాక్షలా మారిందని చెప్పొచ్చు.ఇంకా పనులు పూర్తికి నోచుకోలేదు.మండలాల్లో 172 కిలోమీటర్ల మేర పైపులు వేసేందుకు మిషన్ భగీరథ ఇట్రా అధికారులకు పైపులను సరఫరా చేసింది.167.5 కిలోమీటర్ల మేర పనులు పూర్తికాగా ఇంకా నాలుగున్నర కిలోమీటర్ల మేర వేయాల్సి ఉంది.కానీ ప్రజావసరాలకు ఉపయోగించాల్సిన పైపులను ప్రయివేటే వ్యాపారవేత్తలకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది.మండలకేంద్రంలోని ఓ ప్రయివేట్ వ్యాపార వేత్త ఇంట్లో స్టాండ్‌పై 8575 ఎండీ ఇంట్రా ముద్రవేసిన 50 పైపుల వరకు అమ్మకానికి దర్శమిస్తున్నాయి.కాగా కొన్ని గ్రామాల్లో పైపులు లేవన్న పేర సర్పంచులతోనే పైపులను తెప్పించుకుని పనులు చేస్తున్నారని ప్రజాప్రతినిధుల నుండి గుసగుసలు వినవస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి వ్యాపారవేత్త ఇంట్లో ఉన్న పైపులను స్వాధీనం చేసుకొని అమ్మకానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విచారణ జరిపి పైపులను స్వాధీనం చేసుకుంటాం
మిషన్ భగీరథ ఈట్రా ఏఈ మణిదీప్‌కుమార్
మండలంలోని గ్రామాలకు 172 కిలోమీటర్ల పైపులను అందించా. నేటికీ 167.5 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.నాలుగున్నర కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది.చేయాల్సిన పనులకు సంబంధించి పైపులు సరిపడా ఉన్నాయి.విచారణ జరిపి వ్యాపారవేత్త ఇంట్లో ఉన్న పైపులను స్వాధీనం చేసుకుంటాం.