Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ శిధిలావస్థలో ప్రాథమిక పాఠశాల
నవతెలంగాణ-చింతపల్లి
మండలంలోని గడియ గౌరారం గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆ పాఠశాలను ఎవరూ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.పలుమార్లు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌కి, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్, ఉన్నతాధికారులకు ఎంతో మందికి వినతులు సమర్పించినా.. కాగితాలకే పరిమితమైంది. కానీ పాఠశాలను పట్టించుకునే నాధుడే లేడని పాఠశాల ఎస్ఎంసీ చైర్మెన్ షేక్ రహీం అన్నారు.సోమవారం ఆయన మాట్లాడుతూ స్కూల్ మొత్తం విద్యార్థులు 85 మంది ఉన్నప్పటికీ చెట్ల కింద హెడ్మాస్టర్ ఆఫీస్ రూంలో కూర్చోబెట్టి చదువుకుంటున్నారని, ఈ పాఠశాల పైకప్పులు దూలాలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉందన్నారు.విద్యార్థులు బిక్కుబిక్కుమని భయపడి కొన్ని సందర్భాలలో స్కూల్‌కు రావడమే కష్టమైందన్నారు. ఇదిలా ఉంటే వర్షాకాల సమయంలో స్కూల్ మొత్తం బంద్ చేస్తారన్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిధిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మరమ్మతులు చేయించి విద్యార్థుల భవిష్యత్‌కు దోహదపడాలని కోరారు.