Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్
నవతెలంగాణ - తిరుమలగిరి
ప్రతి రైతూ తాను పండించిన పంట వివరాలను గ్రామానికొచ్చే విస్తరణ అధికారి చేత తప్పకుండా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ కోరారు. గురువారం మండలంలోని అనంతారం గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. వివరాలు నమోదు చేయించుకుంటేనే పంట విక్రయించేటప్పుడు ఇబ్బంది ఉండదన్నారు. 15 రోజులుగా పంట నమోదు వివరాలు సేకరించారని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి జి.వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, తుంగతుర్తి ఏడీఏ జగ్గునాయక్, ఏఈవో వెంకటరెడ్డి, ఎంపీఎస్వో మధుకర్, రైతులు కారుపోతుల నర్సయ్య, దేశిగాని శ్రీనివాస్, అంజయ్య, రాజమల్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.