Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ - సూర్యాపేట
కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 22, 39వ వార్డుల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కరోనా రోగులకు సేవలందించడంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామంజులరెడ్డి, కౌన్సిలర్లు, వైద్యురాలు ఉషారాణి, ఏఎన్ఎమ్, ఆశాలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.