Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయనాయుడు కోరారు. గురువారం స్థానిక మెయిన్ సెంటర్లో భారత్ బంద్ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులు, సామాన్య ప్రజలను మరింత ఇబ్బందుల్లో నెడుతుందన్నారు. దేశ సంపద మొత్తం అంబానీ, అదానీ చేతుల్లో పెట్టి పేదవాడి రక్తాన్ని జలగల్లా పీలుస్తోందని విమర్శించారు. తరతరాలుగా పోడు భూములు నమ్ముకుని జీవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సైదులు, ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు కష్టాల సందీప్, సీపీఐ నాయకులు కొమర్రాజు వెంకట్, సీఐటీయూ నాయకులు ఎస్కె. హఫీజ్, ఏఐకేఎస్ జిల్లా నాయకులు పోతుగంటి కాశి పరమేశ్, సీపీఐ నాయకులు పరసన బోయిన వెంకన్న, సీపీఐ(ఎం) నాయకులు రాచమల్ల బిక్షం, టి.శ్రీను, కిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు.