Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ధనమూర్తి
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సబ్‌ట్రెజరీ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - కోదాడరూరల్
ఉపాధ్యాయ, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆర్.ధనమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపులో ప్రతి నెలా జాప్యం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెలా మొదటి తేదీన చెల్లించాల్సిన వేతనాలు 10వ తేదీ వరకూ ఖాతాల్లో జమ కావడం లేదన్నారు. దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన నెలవారీ వాయిదా గడువులు దాటి తీసుకున్న రుణాలపై జరిమానా పడుతుందని అన్నారు. ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎస్టీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు కే.ఏ మంగ, జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు టి.ఏ జనార్ధన్, డివిజన్లోని మండల బాధ్యులు బి.పిచ్చయ్య, మాతంగి శ్రీనివాస్, నక్క శ్రీనివాస్, మండవ ఉపేందర్, రాందాస్, దస్తగిరి, శ్రీనివాసచారి, హర్షవర్ధన్, రాజు, వై.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.